![]() |
![]() |
.webp)
ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది.
నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్య వీళ్ళిద్దరు కలిసి చేసిన "ఎంగేజ్ మెంట్ కోసం రెడీ అయ్యాం", " మా లవ్ మ్యాటర్ పైన క్లారిటీ", "బక్రీద్ స్పెషల్" వ్లాగ్స్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో వీళ్ళు తాజాగా " ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ అయిపోయింది" అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు నూకరాజు. ఆసియా రాలేదని ఎంతగానో రిక్వెస్ట్ చేసిన తను రాలేదని నూకరాజు చెప్పాడు.
అసలు విషయానికొస్తే నూకరాజు వాళ్ళ అన్నయ్యది ఎంగేజ్ మెంట్ అంట. దానికి సంబంధించిన పనుల్లో ఈ రోజు వరకు తనకి సమయం లేదని, బంధువలందరికి కాల్స్ చేసి చెప్తున్నాడని, ఆసియాకి కూడా కాల్ చేసి రమ్మని చెప్పిన తను రాలేదని చెప్పాడు. అన్మయ్యది ఎంగేజ్ మెంట్ అయింది. పెళ్ళి ఈ నెల 23న జరుగనుంది. మరి ఆసియా పెళ్ళికి వస్తుందో లేదో తెలియదు. చాలా సంతోషంగా ఉందంటూ తన భావాలని వ్లాగ్ లో పంచుకున్నాడు నూకరాజు. అయితే ఈ విషయం తెలియని నెటిజన్లు వీడియో టైటిల్ మరియు థంబ్ నేల్ చూసి " కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ" అంటు ఆసియా, నూకరాజులకి అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |